బీజేపీకి బీఆర్‌ఎస్ బహిరంగంగా మద్దతు ఇచ్చింది : ఓవైసీ

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని పలు స్థానాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బహిరంగంగా మద్దతు ఇచ్చారని

By Medi Samrat  Published on  5 Jun 2024 9:40 AM GMT
బీజేపీకి బీఆర్‌ఎస్ బహిరంగంగా మద్దతు ఇచ్చింది : ఓవైసీ

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని పలు స్థానాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బహిరంగంగా మద్దతు ఇచ్చారని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. BRS నాయకులు చాలా చోట్ల బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇవ్వడం విచారకరం. ఈ విషయం ప్రజల దృష్టికి వచ్చింది. వారు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు. ఇది చాలా తప్పు. ఈ నిర్ణయం వల్ల వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోనున్నారో తెలియదన్నారు.

BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్.. అసదుద్దీన్ ఆరోపణల‌పై స్పందిస్తూ.. ఇది “పచ్చి అబద్ధం” అని అన్నారు. “అసద్ సాబ్.. ప్రతి BRS సోషల్ మీడియా వారియర్ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థికి వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిష‌న్ రెడ్డిపై కేసీఆర్ తనకు అత్యంత నమ్మకస్తుడైన నాయ‌కుడిని పోటీగా రంగంలోకి దించారు. ప్రభుత్వంలో ఉన్నవారి వైపు మొగ్గు చూపే స్వేచ్ఛ మీకు ఉంది, అయితే బీఆర్‌ఎస్ బీజేపీకి పని చేస్తుందన్న మీ ఆరోపణ పచ్చి అబద్ధం” అని ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ఖండించారు.

2024 తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లలో చెప్పుకోదగ్గ విజయాలతో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. జహీరాబాద్‌, పెద్దపల్లె, వరంగల్‌, భోంగిర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌లలో కాంగ్రెస్‌ 8 స్థానాల్లో విజయం సాధించింది.

అసదుద్దీన్ ఒవైసీ గెలుపుతో ఏఐఎంఐఎం హైదరాబాద్‌లో తన కోటను నిలుపుకుంది. భారత రాష్ట్ర సమితి (BRS) ఈ ఎన్నిక‌ల‌లో గణనీయమైన పతనాన్ని ఎదుర్కొంది.

Next Story