నాపై కుట్రలు చేసినా భరించా..హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్

కాళేశ్వరం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.

By Knakam Karthik
Published on : 1 Sept 2025 5:33 PM IST

Telangana, Mlc Kavitha, Kcr, Brs, Harishrao, Kaleshwaram Project, CM Revanth

నాపై కుట్రలు చేసినా భరించా..హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్

కాళేశ్వరం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం నివేదికను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్ రావు, హరీశ్ రావు, మెగా కృష్ణారెడ్డి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు. హరీశ్‌ రావుది మేజర్ పాత్ర. అందుకే హరీశ్‌రావును రెండోసారి పక్కన పెట్టారు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటడానికి ముగ్గురే కారణం. వీరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని..కవిత ఆరోపించారు.

ఈ ముగ్గురు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి, కేసీఆర్ ప్రజల కోసం నీళ్ల కోసం ఆలోచన చేస్తే.. వీళ్లు ముగ్గురు సొంత వనరులను పెంచుకుని ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఏ మాత్రం సంబంధం లేని, కేసీఆర్ కాలి గోటికి సరిపోని రేవంత్ రెడ్డి చేయెత్తి చూపించి సీబీఐ ఎంక్వయిరీ వేస్తా అనడానికి కారణం ఎవరు? అని కవిత ప్రశ్నించారు. ఇదే హరీశ్ రావు, సంతోష్ రావు నాపై అనేక కుట్రలు చేసినా భరించా. నాపై బహిరంగంగానే మీడియా మిత్రులతో అనేక రకాల మాటలు చెప్పినా భరించా..అని కవిత పేర్కొన్నారు.

Next Story