సింగరేణి కార్మికుల కోసం ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు

By Knakam Karthik
Published on : 27 May 2025 2:56 PM IST

Telangana, Brs Mlc Kavitha, Congress, Brs, Kcr, Telangana Jagruthi

సింగరేణి కార్మికుల కోసం ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు, తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను నియమించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా జాగృతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోంది. సీఎం రేవంత్, ప్రధాని మోడీ కోసం పని చేస్తున్నాడని..అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట్లాడటం లేదు..అని కవిత విమర్శించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం..అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Next Story