నాపై దుష్ప్రచారం పార్టీకే నష్టం..ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
నాపై దుష్ప్రచారం పార్టీకే నష్టం..ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. నాపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నాపై కుట్రలు ఎవరు చేస్తున్నారో తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నా. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెబుతున్నా. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా. పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు నమ్మకం పెరుగుతోంది. ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదు..అని కవిత వ్యాఖ్యానించారు.
రెచ్చగొట్టకండి? నేను ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా... ఇంకా నన్ను కష్టపెడతారా? అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాననని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.