డిగ్రీ ఉన్నవారికి ఉద్యోగం లేదు.. లేని వ్యక్తికేమో అత్యున్నత ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి డిగ్రీ పట్టాల విషయంలో ఎగతాళి చేస్తూనే ఉన్నారు.

By అంజి
Published on : 2 April 2023 3:00 PM IST

BRS, MLC Kavitha, PM Modi , BJP, Telangana

డిగ్రీ ఉన్నవారికి ఉద్యోగం లేదు.. లేని వ్యక్తికేమో అత్యున్నత ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి డిగ్రీ పట్టాల విషయంలో ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె. కవిత ప్రధాన మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తన డిగ్రీని అందజేస్తానని ముందుకొచ్చాక, ఆయన సోదరి, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు కె.కవిత ఆదివారం నాడు భారతదేశంలో నిజమైన డిగ్రీలు ఉన్నవారికి ఉద్యోగం రాదని, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం ఉందని వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ప్రశ్నించారు.

''దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది. ఇది 3 నెలల గరిష్ఠ స్థాయి. కానీ దీన్ని పట్టించుకుంటున్నారా? యువత శక్తి, సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి చేస్తున్నారా? నేటి భారతదేశంలో ఉన్న వాస్తవం ఏంటంటే.. నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం దక్కింది’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. గతంలో మంత్రి కేటీఆర్‌ కూడా తన డిగ్రీలు చూపించి ప్రధానిని ఎగతాళి చేశారు.

''నేను పూణే యూనివర్సిటీ నుండి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నాను. న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నాను. రెండు సర్టిఫికేట్లను పబ్లిక్‌గా పంచుకోగలను" అని శుక్రవారం నాడు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే విషయంలో గుజరాత్ హైకోర్టు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రధాని మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్‌ను అందించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల వివరాలను సమర్పించాలని ప్రధాన సమాచార కమిషన్ (సిఐసి) ప్రధాన సమాచార కమిషన్ (సిఐసి) ఉత్తర్వును కోర్టు కొట్టివేసింది.

Next Story