బ్యాగులు మోసి, బ్యాడ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు..హరీష్‌రావు హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik
బ్యాగులు మోసి, బ్యాడ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు..హరీష్‌రావు హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం..సీఎం రేవంత్ సిద్ధమా?.అని హరీశ్ రావు సవాల్ విసిరారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు మా మైక్ కట్ చేయకూడదు. రేవంత్ తెలంగాణ ఉద్యమ ద్రోహి. సీఎం హోదాలోనూ రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. బయటివారికి సద్దులు కడుతూ.. ఇంటి మనిషి కేసీఆర్‌పై నిందలు వేస్తున్నాడు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఇచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో ఇచ్చినట్లు ఉంది. ఉత్తమ్ పీపీటీ..చంద్రబాబు తయారు చేశారా అన్న అనుమానం కలుగుతుంది. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న విషఫయాన్ని పీపీటీలో ఎందుకు చూపించలేదు? అహంకారంతో మాట్లాడితే.. రేవంత్‌ను ప్రజలు పాతాళానికి తొక్కుతారు. చంద్రబాబు కోసం బ్యాగ్‌లు మోసి, రేవంత్ బ్యాడ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు..అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ మర్చిపోలేకపోతున్నాడు. విభజన హామీల ముసుగులో ప్రజాభవన్ వేదికగా బనకచర్ల ఒప్పందం కుదిరింది. ప్రజాభవన్ వేదికగా 2024 జూలై 6న రేవంత్ తెలంగాణకు మరణశాసనం రాశాడు. సెప్టెంబర్ 23న ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా బెజవాడ పోయి బజ్జీలు తిని బనకచర్లకు పచ్చజండా ఊపారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్రం బనకచర్లకు అనుమతులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ చచ్చిన పాము అయితే.. ఎందుకు బీఆర్ఎస్ ను విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్కసారైనా రేవంత్ రెడ్డి ఉండగలరా? ముఖ్యమంత్రిగా కాకుండా.. రేవంత్ ఇంకా ప్రతిపక్ష నేత మాదిరి మాట్లాడుతున్నారు. ఇరు రాష్ట్రాలు కూర్చుని ఆమోదయోగ్యంగా మాట్లాడుకుందామని మాత్రమే కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హాయాంలో బనకచర్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే బనకచర్ల. రేవంత్ రెడ్డే సతీసమేతంగా ఉత్తమ్ ను విజయవాడు పంపించాడు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు సీటు గెలవలేదు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా. చచ్చిన పాము ముచ్చట్లు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పుకోవాలి. కుక్కతోవ వంకర అన్నట్లు రేవంత్ రెడ్డివి అన్నీ అబద్దాలే. రాష్ట్ర హక్కులు కాకుండా.. రాజకీయాలు కేంద్రంగా రేవంత్ మాట్లాడుతున్నారు..అని హరీశ్ రావు పేర్కొన్నారు.
నాడు బాబు కోసం బ్యాగ్ మ్యాన్ అయిన రేవంత్నేడు బొంకు మ్యాన్ గా మారిండు.బనకచర్ల మీద ఇప్పటికైనా ఈ బొంకుడు మాటలు బంద్ పెట్టు!- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish. pic.twitter.com/MjksNOO3pA
— BRS Party (@BRSparty) July 2, 2025