కాలం తెచ్చిన విపత్తు కాదు..కాంగ్రెస్ తెచ్చిన విపత్తు: హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik
కాలం తెచ్చిన విపత్తు కాదు..కాంగ్రెస్ తెచ్చిన విపత్తు: హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తుంది. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని ఎక్స్ వేదికగా స్పందించారు. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచింది. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచింది. కష్టపడి పండించిన ధాన్యమంతా తడిసి ముద్దయింది. ప్రభుత్వం ధాన్యం కొనకపోగా, పరిహారం కూడా చెల్లించకపోవడంతో తడిసిన ధాన్యం రాశి ముందు రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యం. రైతుల జీవితాల్లో కాలం తెచ్చిన విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇది. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా నేడు అకాల వర్షాలపాలు చేసి ఆగం చేస్తున్నారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకోవాలి. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తుకు పెట్టుకోవాలి. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను… pic.twitter.com/6wIvSpjgVl
— Harish Rao Thanneeru (@BRSHarish) April 15, 2025