తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంట్లోనే.. ఈ నలుగురు ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం ఆసక్తిగా మారింది.
ఇక నేడు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ప్రసాద్ రెడ్డి తన తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి, రిసెప్షన్‌కు రావాలని సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులకు ఆశీర్వచనం అందజేయాలని సీఎం దంపతులను వారు కోరారు.