ఓయూలోని యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసినందుకు గాను భారత రాష్ట్ర సమితి నాయకుడు మన్నె క్రిశాంక్‌పై ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. యూనివర్శిటీ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించిన నకిలీ నోటీసులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని ఓయూ చీఫ్ వార్డెన్ జీ శ్రీనివాస్ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందేశం అబద్ధమని, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అన్నారు.
ఫేక్ మెసేజ్ సర్క్యులేషన్‌ను ఆపాలని, తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేసిన మన్నె క్రిశాంక్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ జీ శ్రీనివాస్ పోలీసులను అభ్యర్థించారు. ఫిర్యాదు ఆధారంగా ఓయూ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వై కాశయ్య మన్నె క్రిశాంక్‌పై Cr no 207/2024 U/s 466, 468, 469, 505 (1) (c ) IPC సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.