అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై కొట్లాడాలి..గాంధీభవన్ వద్ద రైతు నిరసనపై హరీష్‌రావు ట్వీట్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 21 Feb 2025 1:50 PM IST

Telangana, Cm Revanth, HarishRao, Brs, Congress, Gandibhavan

అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై కొట్లాడాలి..గాంధీభవన్ వద్ద రైతు నిరసనపై హరీష్‌రావు ట్వీట్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరి గారికి ఏం సమాధానం చెబుతారు. అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నరు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు.. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. అని హరీష్ రావు మండిపడ్డారు.

ఈరోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు, రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తారు. ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించాలి. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారులను వేడుకున్నడు. అయినా వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి గారి పట్టుదలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం. అని హరీష్ రావు ఎక్స్ వేదికగా రైతు వీడియోను ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చారు.

అయితే తనకు రుణమాఫీ కాలేదంటూ గాంధీ‌భవన్ మెట్ల మీద శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం, అంబర్‌పేట్ గ్రామానికి చెందిన తోట యాదగిరి మెట్లపై కూర్చోని ధర్నాకు దిగారు. వెంటనే తనకు రైతు రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, తనకు మాత్రం రుణమాఫీ కాలేదని తెలిపారు. తనకు రూ.3 లక్షలకు పైగా క్రాప్‌లోన్ ఉన్నదని, కానీ రుణమాఫీ కాలేదన్నారు. మరోవైపు తనకు ఎలాంటి పింఛన్, ప్రభుత్వ సాయం, వడ్ల బోనస్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story