బడ్జెట్ బడా జూట్, డబ్బులు లేవు కానీ అందాల పోటీలు నిర్వహిస్తారా?: హరీష్ రావు
బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయత కోల్పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik
బడ్జెట్ బడా జూట్, డబ్బులు లేవు కానీ అందాల పోటీలు నిర్వహిస్తారా?: హరీష్ రావు
బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయత కోల్పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ మీడియా హాల్ దగ్గర హరీష్ రావు మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి అబద్దాలు, రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అన్నారు. జీవో నెంబర్ 27లో వడ్డీ లేని రుణాలు 5 లక్షల వరకే అని ఉంది. ఇస్తుంది 5 లక్షలకే కానీ, చెప్పేది 20 లక్షల వరకు అని అబద్ధాలు చెప్పారు. 2024-25 బడ్జెట్‌లో చెప్పిన స్టిచింగ్ ఛార్జీల విషయాలే మళ్లీ రిపీట్ చేశారు. సేమ్ అదే పేజీలో మార్పు లేకుండా ప్రింట్ చేశారు..అని హరీష్ రావు అన్నారు.
మహాలక్ష్మీ పథకానికే డబ్బులు లేవు కానీ అందాల పోటీలు నిర్వహిస్తారట..అని హరీష్ రావు సెటైర్ వేశారు. రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామన్నారు..అసెంబ్లీలో మాత్రం రూ.20 వేల కోట్లు చేశామని చెప్పారు. నా నియోజకవర్గంలో 2 లక్షల లోపు రుణమాఫీ 10 వేల మంది రైతులకు కాలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో అయినా రుణమాఫీ వంద శాతం కాలేదు. గత బడ్జెట్‌లోని అంశాలే చాలా రిపీట్ చేశారు. జీఎస్‌డీపీ గ్రోత్ రేట్ మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 2.5 శాతం తగ్గింది. రాష్ట్రం అప్పుల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే, బడ్జెట్ బుక్‌లో రెవెన్యూ మిగులు రూ.2500 కోట్లు అని చెప్పారు. రాజకీయంగా సీఎం దివాళ తీశారు, రాష్ట్రం కాదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఫాల్స్‌గా మార్చారు. రాష్ట్ర బడ్జెట్ బడా జూట్..అని హరీష్ రావు విమర్శించారు.
LIVE: రాష్ట్ర బడ్జెట్ పై మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు@BRSHarish https://t.co/AQx48olBeh
— BRS Party (@BRSparty) March 19, 2025