ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే SLBC సందర్శనకు వెళ్తున్నాం, అడ్డుకోవద్దు: హరీష్ రావు

ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్తున్నాం, అని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

By Knakam Karthik
Published on : 27 Feb 2025 10:09 AM IST

Telangana, SLBC tunnel Incident, HarishRao, Brs, Congress, Cm Revanth

ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే SLBC సందర్శనకు వెళ్తున్నాం, అడ్డుకోవద్దు: హరీష్ రావు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సందర్శనకు బయల్దేరే ముందు హైదరాబాద్‌ కోకాపేట్‌లోని ఆయన నివాసంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాద ఘటనలో సహాయక బృందాల సమన్వయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ఐదు రోజులు అయినా 8 మంది కార్మికులు టన్నెల్‌లోనే ఉండిపోయారు. సహాయక చర్యలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరిగారు.. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేసేందుకు పోటీ పడుతున్నారు." అని హరీష్‌ రావు విమర్శించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన దారుణంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ పనులు జరగలేదని సీఎంతో పాటు మంత్రులు అబద్ధాలు చెబుతున్నారు. మా హయాంలో 13 కిలోమీటర్ల మేర సొరంగం పనులు చేపట్టాం. టీఎంబీ మిషన్ బేరింగులు రిపేర్ వస్తే, అమెరికా నుంచి తెప్పించి మరీ కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపట్టింది." అని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్తున్నాం, పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవద్దు, సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదని ఇన్ని రోజులు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం." అని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

Next Story