సీఎం కేసులు పెడితే, డిప్యూటీ సీఎం ఉపసంహరిస్తారా?: హరీష్‌రావు

యావత్ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

By Knakam Karthik
Published on : 9 April 2025 4:11 PM IST

Telangana, Harishrao, Congress Government, Brs,

సీఎం కేసులు పెడితే, డిప్యూటీ సీఎం ఉపసంహరిస్తారా?: హరీష్‌రావు

తెలంగాణలోని కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏవి పాలో, ఏవి నీళ్లో అర్థమైందని, యావత్ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం గణేశ్ గడ్డ సిద్దివినాయక ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణనను నిలబెడితే, రేవంత్ రెడ్డి పడగొట్టారు. కేసీఆర్ ఎప్పుడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసి, ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు నీళ్లు అందించాలని మాట్లాడితే.. రేవంత్ రెడ్డి ఏమో పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా, చంపుతానని మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది సాగు భాష అయితే రేవంత్‌ది చాబు భాష..అని హరీష్ రావు విమర్శించారు.

ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పారు... ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు గురించి చెప్పాలంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణను నిలబడితే, రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్ రావు పేర్కొన్నారు. జీఎస్టీ వాటా తగ్గిందంటే అందుకు కారణం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది... రేవంత్ రెడ్డి పాలన అంతా సగం సగం... ఆగం ఆగం అని విమర్శించారు.

ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించారట ఉపముఖ్యమంత్రి హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకుంటారంట. అంటే రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా అని హరీశ్ రావు నిలదీశారు. హోంశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి కేసులు పెడితే ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటామని ప్రకటిస్తున్నారు ఇదేమి రాజ్యం అని నిలదీశారు. తోక కుక్క నాడిస్తున్నదా? కుక్క తోక నాడిస్తున్నదా అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులో పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్ సీయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story