తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది : జీవీఎల్

BJP’s presence in the Telugu states increased. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి పెరిగిందని, బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు

By Medi Samrat  Published on  25 Jun 2023 8:03 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది : జీవీఎల్

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి పెరిగిందని, బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. పాట్నాలో జ‌రిగిన విప‌క్షాల భేటీ గురించి ప్రస్తావించారు. అది అవినీతి పార్టీల గుంపు అని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని జీవీఎల్ కామెంట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బాగా పనిచేస్తోందని, తెలుగు రాష్ట్రాలపై పార్టీ దృష్టి సారించిందని, దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆయన అన్నారు.

ఎమర్జెన్సీ రోజుల‌ను గుర్తు చేసిన ఎంపీ జీవీఎల్.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ఎమర్జెన్సీ విధించార‌ని.. చ‌రిత్ర‌లో ఈ రోజు బ్లాక్ డేగా మిగిలిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజు ఇది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాము ఎదో చేసి.. స్వతంత్రం తెచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. ఇందిరా గాంధీ అధికారంలో ఉండగా.. ప్రజలని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టిన విషయం రాహుల్ గాంధీకి తెలీదా? అని ప్రశ్నించారు. దేశంలో విచ్చల విడిగా అవినీతి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. ఇందిరా గాంధీ అధికారంలో ఉండగా.. ప్రజలను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టిన విషయం రాహుల్ గాంధీకి తెలీదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన అరాచకాలు ప్రతీ ఒక్కరూ తెలుసుకునే లాగా పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం స్థాయి పెరిగిందన్నారు.


Next Story