ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది : కేటీఆర్

భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వస్తే రిజర్వేషన్లు ఉండకపోవచ్చని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  17 April 2024 10:30 AM GMT
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది : కేటీఆర్

భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వస్తే రిజర్వేషన్లు ఉండకపోవచ్చని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీ రామారావు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ తీసుకుని వచ్చే ఈ మార్పులు అణగారిన వర్గాలకు పెద్ద ముప్పుగా మారుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించే లక్ష్యంతో ఉందని ప్రముఖ బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటించారన్నారు కేటీఆర్. అదే జరిగితే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

దళిత, గిరిజన సంఘాలు బీజేపీ వ్యూహాన్ని గుర్తించి ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఆగస్టు 15లోగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు రేవంత్ హామీ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. వాగ్దానాలు నెరవేరాలంటే ప్రజలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Next Story