బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఎప్పుడంటే..?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on  2 Oct 2023 2:15 PM GMT
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఎప్పుడంటే..?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. సెప్టెంబర్ 10వ తేదీన అమిత్‌షా తెలంగాణకు వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 5,6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించనున్నామని.. జేపీ నడ్డా రాబోయే ఎన్నికల కోసం దిశానిర్ధేశం చేస్తారన్నారు కిషన్ రెడ్డి. అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారన్నారు. నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారన్నారు.

వచ్చే తెలంగాణ ఎన్నికలకు గాను రాష్ట్ర బీజేపీ నాయకులకు నడ్డా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి చెప్పడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఖరారైన అభ్యర్థుల వివరాలను బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీకి పంపుతామని కిషన్ రెడ్డి తెలిపారు. అక్కడ ఫైనల్ అయిన తర్వాత ఢిల్లీ నుంచే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story