వారి అసలు రంగు బయటపడింది, మళ్లీ ఒక్కటి కాబోతున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik
వారి అసలు రంగు బయటపడింది, మళ్లీ ఒక్కటి కాబోతున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటివరకు పార్లమెంటులో లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కానీ, అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజరారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయని అన్నారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని, భవిష్యత్తులోనూ చేస్తోందన్నారు.
గత 15 నెలలుగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. మళ్లీ అధికారం కోసం ఆరాటపడుతుంది. పాత దోస్తాన్ మళ్లీ ఒకటి కాబోతుంది. గత నాలుగేళ్లుగా తమిళనాడులో కుటుంబ పాలన, కుంభకోణాల పాలన నడుస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డీలిమిటేషన్ పేరుతో, భాష పేరుతో బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో, తెలంగాణలో గెలిచేలా, తమిళనాడులో మరింత పట్టు సాధించేలా అంకితభావంతో పని చేస్తున్నామని చెప్పారు. అయితే, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే రాజకీయ కుట్ర కోణంతో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు పార్టీలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధే మోడీ లక్ష్యం. డీ లిమిటేషన్‌కు సంబంధించి ఏమైనా ఇప్పుడు చట్టాలు ఉంటే అది కాంగ్రెస్ చేసిన చట్టాలే. తెలంగాణలో 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ గ్యారెంటీపై దృష్టి పెడితే బాగుంటుంది. కేంద్రంపై, డీ లిమిటేషన్ పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోదు..అని కిషన్ రెడ్డి విమర్శించారు.
— BJP Telangana (@BJP4Telangana) March 23, 2025