పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ సీనియ‌ర్ నేత, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

By Medi Samrat  Published on  17 March 2024 8:15 PM IST
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ సీనియ‌ర్ నేత, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ అన్నారు. హైదరాబాద్‌లోని హమారా సంకల్ప్ వికాసిత్ భారత్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా హోటల్ కత్రియాలో ఏర్పాటు చేసిన అడ్వకేట్స్ మీట్‌కు డా.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంద‌ని అని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే భార‌త దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రజల మనోగతాన్ని తీసుకుని మ్యానిఫెస్టోలో తయారు చేయడానికి బీజేపీ సిద్ధం అయ్యిందని తెలిపారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, వెనుక బడిన వర్గాల సలహాలు తీసుకోవడానికి ముందుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు.

Next Story