హైదరాబాద్: హిల్ట్ కుంభకోణం రుజువు చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటా..అని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇందిరాచౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. హిల్ట్‌పై పార్టీ ఆదేశిస్తూ ఆమరణ దీక్ష చేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి, కుంభకోణాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. రెండేళ్లు గడుస్తున్న ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదు. సీఎం రేవంత్ రెడ్డి లంకే బిందెల వేటలో ఉన్నాడు . కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో R ట్యాక్స్, RR ట్యాక్స్, B ట్యాక్స్, U ట్యాక్స్ పేరిట కుంభకోణాలకు పాల్పడ్డారు .
హామీని నెరవేర్చని ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు హామీలన్నీ అటకెక్కించారు. చీకటి G.O నెంబర్ 27 తో 9292 ఎకరాల భూమిని కేవలం SRO వాల్యూ లో 30 శాతానికే కట్టబెట్టారు . ఎన్విరాన్మెంటల్ స్టడీ జరగలేదు . ఇండస్ట్రీలో ఎన్ని గ్రీన్ జోన్ ఎన్ని ఆరెంజ్ జోన్ లో ఎన్ని రెడ్ జోన్ లు ఉన్నాయో ప్రకటించాలి..అని ఏలేటి మహేశ్వర్ డిమాండ్ చేశారు.