ఆయనకు బట్టలు విప్పే ఫాంటసీ ఏంటో? సీఎంపై మహేశ్వర్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బట్టలు విప్పే ఫాంటసీ ఏంటో అర్థం కావడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

By Knakam Karthik  Published on  16 March 2025 7:10 PM IST
Telangana, Cm Revanthreddy, Bjlp Aleti Maheshwar reddy, Bjp, Congress

ఆయనకు బట్టలు విప్పే ఫాంటసీ ఏంటో? సీఎంపై మహేశ్వర్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బట్టలు విప్పే ఫాంటసీ ఏంటో అర్థం కావడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ఇలాంటి మాటలు మాట్లాడలేదు. బట్టలు ఊడదీస్తా, గుడ్డలు ఊడదీస్తా లాంటి మాటలు ఎందుకు? ప్రజలు మీ బట్టలు విప్పేందుకు రెడీ అవుతున్నారు. ముందు దాని మీద దృష్టి పెట్టండి. నేను అవకాశాల కోసం పార్టీలు మారను. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే అది పార్టీ పెద్దల నిర్ణయం అని.. మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 'రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.

ఇంతకీ రేవంత్ ఏం మాట్లాడారు..

సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియా బాధ్యతలపై ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం అని ఆయన గుర్తు చేస్తూ, గౌరవంగా, నిజాయితీగా వార్తలు అందిస్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, పచ్చి అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు, అవాస్తవ కథనాలు రాసేవారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరినైనా గౌరవిస్తామని, అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సంఘాల నాయకులు జర్నలిస్టులు లిస్టు ఇవ్వాలని, ఆ లిస్టులో ఉన్న వాళ్ల తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలన్నారు. ఆ లిస్ట్‌లో లేని వాడు జర్నలిస్ట్ కాడని, అలాంటి వాళ్లను క్రిమినల్స్ లాగే చూడాల్సి వస్తుందని తెలిపారు. అలాంటి క్రిమినల్స్ ముసుగు ఊడదీసి, బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story