పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు ఇచ్చారు. బెంగాల్ నుంచి ఇరవై, మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు, గుజరాత్ నుంచి పదిహేను, రాజస్థాన్ నుంచి పదిహేను, కేరళ నుంచి పన్నెండు, తెలంగాణ నుంచి తొమ్మిది, అసోం, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పదకొండు సీట్ల చొప్పున, ఢిల్లీ నుంచి ఐదు స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు.
తెలంగాణ నుంచి.. కేంద్రమంత్రి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత ధర్మపురి అరవింద్‌లకు టిక్కెట్ దక్కింది. ఈటల రాజేందర్, బీబీ పాటిల్, మాధవీలతకు టిక్కెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం.
కరీంనగర్ - బండి సంజయ్
భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
నిజామాబాద్ - ధర్మపురి అరవింద్
జహీరాబాద్ - బీబీ పాటిల్
హైదరాబాద్ - మాధవీలత
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
మల్కాజిగిరి - ఈటల రాజేందర్
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ - పీ భరత్ గౌడ్