బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లడంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభకు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదని, కేవలం తన నెల జీతం తీసుకోవడానికి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమేనని అన్నారు.
అసెంబ్లీకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు హంగామా చేశారని, తీరా చూస్తే కేసీఆర్ రెండు నిమిషాలు కూడా సభలో ఉండకుండానే వెళ్లిపోయారన్నారు. దళితుల పట్ల కేసీఆర్‌కు ఉన్న వివక్ష ఈ పర్యటనతో మరోసారి బయటపడిందని బీర్ల ఐలయ్య ఆరోపించారు. సభలో దళిత స్పీకర్‌ను అధ్యక్షా అని సంబోధించాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ మైక్ అడగకుండానే వెళ్లిపోయారన్నారు ఐలయ్య.