నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
By - Knakam Karthik |
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీ సంఘాల పిలుపుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. కాగా ఈ బంద్‌లో పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. మరో వైపు బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. దీంతో ఇటు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా క్లోజ్ కానున్నాయి.
రాష్ట్ర వ్యాప్త బంద్‌పై ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని.. బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డిజిపి అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిజిపి సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.