దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో తెలంగాణలోని కాంగ్రెస్-ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించడంతో హైదరాబాద్‌లో బ్యానర్ వార్ చెలరేగింది. ఈ ఏడాది దావోస్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి విశేషమైన పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకుని రాగా, ఈసారి నాలుగు రెట్లు పెరిగిందని చెబుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు కేటీ రామారావును టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేశారు. అందుకు తగ్గట్టుగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్‌లలో "పెట్టుబడుల వల్ల కడుపు మంటగా ఉందా? ENO ఉపయోగించండి!" అంటూ బ్యానర్లు పెట్టారు.
మరోవైపు, BRS పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. "మార్పు మార్పు అంటూ.. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడం తప్ప, మేస్త్రి చేసిందేమీ లేదు. ఫేక్ పెట్టుబడుల ముసుగులో వేల కోట్లు దోచుకుంటున్న రేవంత్ గ్యాంగ్." అంటూ పోస్టు పెట్టారు.