మహాత్మజ్యోతిరావు పూలే ఆశయాలకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..మహాత్ముల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు నివాళి అర్పిస్తే చాలదు. మహాత్ముల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి అసలైన నివాళి. కాంగ్రెస్ పాలకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..అని బండి సంజయ్ సూచించారు.
అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్ మహాత్మా జ్యోతిరావు పూలే. దళిత, బడుగు, బలహీనవర్గాల ధైర్యం పూలే. పేదల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన మహనీయుడు. ఇకనైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులను, కాలేజీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయండి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు తీసుకోండి..అని కాంగ్రెస్ సర్కార్‌కు బండి సంజయ్ సూచించారు.