గత BRS పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) . కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగస్టు 8న సాక్షిగా విచారణకు హాజరు కానున్నారు.
జూలై 28న తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని బండి సంజయ్ కుమార్ ను గతంలో సిట్ అధికారులను కోరినప్పటికీ, పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఆయన హాజరుకాలేకపోయారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ చాలా ఆధారాలను సమర్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హస్తం ఉందని పలు సందర్భాల్లో బండి సంజయ్ ఆరోపించారు. తాను దర్యాప్తుదారులకు సహకరిస్తానని బండి సంజయ్ కుమార్ గతంలోనే చెప్పారు.