జాతీయ జెండాను చేతపట్టని వాడు భారతీయుడే కాదు

నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద జ‌రిగిన‌ ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో పాల్గొన్న‌ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

By Medi Samrat  Published on  12 Aug 2024 10:21 AM GMT
జాతీయ జెండాను చేతపట్టని వాడు భారతీయుడే కాదు

నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద జ‌రిగిన‌ ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో పాల్గొన్న‌ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే.. రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందన్నారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమ‌న్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే.. అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పని చేస్తే తప్పుపడతారా? అని ప్ర‌శ్నించారు.

వక్ఫ్ బోర్డు బిల్లుకు నెహ్రూ, పీవీ, మన్మోహన్ హయాంలో సవరిస్తే తప్పులేదట.. ఆ తప్పులను సరిదిద్దేందుకు మోదీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెస్తే తప్పుపడతారా.? అని ఫైర్ అయ్యారు. మతం పేరుతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తుంద‌ని ఆరోపించారు. పంద్రాగస్టున జెండా, ఎజెండాను పక్కనపెట్టి మువ్వెన్నెల జెండాను ప్రతి ఇంటిపై ఎగరేయండని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను చేతపట్టని వాడు భారతీయుడే కాదన్నారు. జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. నేటి నుండి పంద్రాగస్టుదాకా ప్రతి ఒక్కరి ఫోన్ వాట్సప్ లో మువ్వెన్నెల జెండాను డీపీలుగా పెట్టండని సూచించారు.

Next Story