మాజీ మంత్రి హరీష్‌రావుపై బాచుపల్లి పీఎస్‌లో కేసు..ప్రాణ హాని ఉందని వ్యక్తి ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది.

By Knakam Karthik
Published on : 28 Feb 2025 2:09 PM IST

Telangana, Brs, HarishRao, Hyderabad, Bachupally Police,

మాజీ మంత్రి హరీష్‌రావుపై బాచుపల్లి పీఎస్‌లో కేసు..ప్రాణ హాని ఉందని వ్యక్తి ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కంప్లయింట్‌తో హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు హరీష్‌ రావుపై 351(2) R/W3, (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చక్రధర్ గౌడ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాచుపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా వంశీకృష్ణ, ఏ2గా హరీష్ రావు, ఏ3గా సంతోష్ కుమార్, ఏ4గా రాములు, ఏ5గా వంశీ పేర్లను చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. హరీష్ రావు మినహా కేసులు నమోదైన వాళ్లంతా ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయినట్లు తెలుస్తోంది.

గతంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ పోలీసులను ఆశ్రయించారు. హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని 2024 డిసెంబర్ 5న హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో దర్యాప్తుపై స్టే విధించింది.హరీశ్ రావు పీఏ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బెదిరిస్తున్నారని వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములును ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story