పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌ల అనర్హత పిటిషన్లనూ కొట్టేసిన విషయం తెలిసిందే.