తెలంగాణలో ఎన్నికలు.. వారికి సెలవు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు అర్జిత సెలవు ఇవ్వాలని

By Medi Samrat  Published on  29 Nov 2023 6:16 PM IST
తెలంగాణలో ఎన్నికలు.. వారికి సెలవు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు అర్జిత సెలవు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఉద్యోగులకు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఓటు ఉన్నట్టు ఓటరు కార్డు చూపితే ఆర్జిత సెలవు వర్తిస్తుందని తెలిపారు.

నవంబరు 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి ఓటు హక్కును వినియోగించుకోడానికి ప్రజలు సొంత ఊళ్ళ బాటపట్టారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నవంబర్ 30న అన్ని సంస్థలు, కంపెనీలు, సెలవు ప్రకటించాలని ఎన్నికల సంఘం లేబర్ కమిషన్‌ను ఆదేశించింది. ఒకవేళ సెలవు ప్రకటించని పక్షంలో ఎలక్టోరల్ లా, లేబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు.

Next Story