అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తెలంగాణకు రానున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2023 6:49 PM ISTకేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తెలంగాణకు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం అదిలాబాద్‌లోని డైట్ కళాశాల మైదానంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్‌లో అదే రోజు అమిత్ షా సభ నిర్వహించగా.. ఆ సభ రద్దయింది. దీనికి బదులు సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారు.
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే:
మంగళవారం మధ్యాహ్నం గం.1.45 కు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం గం.2.35కు ప్రత్యేక హెలీకాప్టర్‌లో అదిలాబాద్‌కు చేరుకుంటారు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకూ అదిలాబాద్ సభలో పాల్గొంటారు. 4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.05కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.20 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 కు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు. 6.20 నుంచి 7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7.40కి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవ్వనున్నారు. రాత్రి 9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా.