తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన ఎమ్మెల్సీలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఐదింటిలో మూడు కాంగ్రెస్..ఒకటి సీపీఐ మరొకటి బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలుపొందిన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్... సీపీఐ నుంచి ఎన్నికైన సత్యంలు ఉదయం 9 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్సీ కొమురయ్య, ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.