బీఆర్ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి వైదొలిగిన కొద్ది రోజుల తర్వాత, డాక్టర్ RS ప్రవీణ్ కుమార్.. మార్చి 18న భారత రాష్ట్ర సమితి (BRS) లో చేరారు

By Medi Samrat  Published on  18 March 2024 8:15 PM IST
బీఆర్ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి వైదొలిగిన కొద్ది రోజుల తర్వాత, డాక్టర్ RS ప్రవీణ్ కుమార్.. మార్చి 18న భారత రాష్ట్ర సమితి (BRS) లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు.. ప్రవీణ్ కుమార్‌ను పార్టీలోకి స్వాగతించారు. "డాక్టర్ ఆర్‌ఎస్‌పి గారూ బీఆర్‌ఎస్‌లోకి స్వాగతం జై తెలంగాణ..జై భీమ్" అని కేటీఆర్ పోస్ట్ చేశారు. మార్చి 16న, బీఎస్పీ నుంచి వైదొలిగిన వెంటనే, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ని కలిశారు.

BSP యొక్క తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్.. "దయచేసి నన్ను క్షమించండి, నాకు వేరే మార్గం లేదు" అనే సందేశంతో బీఎస్పీని వీడుతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రవీణ్ కుమార్.. మాన్య కాన్షీరామ్ అడుగుజాడ‌ల్లో సామాజిక న్యాయం కోసం పని చేస్తానని తెలిపారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని వీడుతూ ఉండగా.. ప్రవీణ్ కుమార్ చేరడం ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ గా మారనుంది.

Next Story