విద్యుత్ మీటర్ కావాలని వెళ్తే లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రెగాలియా గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం నాడు కేసు నమోదు చేసింది

By Medi Samrat  Published on  5 Nov 2024 9:30 PM IST
విద్యుత్ మీటర్ కావాలని వెళ్తే లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రెగాలియా గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం నాడు కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారు నిర్మిస్తున్న కొత్త ఇంటికి విద్యుత్ మీటర్ కనెక్షన్‌కు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.18,000 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

పుల్లయ్య తనకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు విధుల దుర్వినియోగం చేసాడని ఏసీబీ అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించడం లేదు. పుల్లయ్యను అరెస్ట్‌ చేస్తున్నామని, వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ తెలిపింది.

Next Story