తెలంగాణలో కరోనా కేసులు నిన్న‌టితో పోలిస్తే కొద్దిగా త‌గ్గాయి. గడిచిన 24 గంటల్లో 894 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,61,728 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1423 మంది మృతి చెందారు. తాజాగా 1,057 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,47,790 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5శాతం ఉంది. ఇక రికవరీ రాష్ట్రంలో 94.67 శాతం ఉండగా, దేశంలో 93.6 శాతం ఉంది. మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,515 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 10,245 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో అత్య‌ధికంగా 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
సామ్రాట్

Next Story