సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: కేటీఆర్‌

తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

By -  అంజి
Published on : 13 Sept 2025 12:10 PM IST

Sakala Janula Samme, BRS, KTR, Telangana, KCR

సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: కేటీఆర్‌

తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఉద్యమానికి నేటితో 14 ఏళ్లు నిండాయన్నారు. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. 2011 సెప్టెంబర్‌ 12న కరీంనగర్‌ జనగర్జనలో కేసీఆర్‌ పిలుపు మేరకు యావత్‌ తెలంగాణ సమాజం ఒక్కటయ్యిందని, ఔర్‌ ఏక్‌ ధక్కా.. తెలంగాణ పక్కా అంటూ నినదించిందన్నారు. నిరసన తెలిపి తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిందని పేర్కొన్నారు.

''తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె. సెప్టెంబర్ 12, 2011 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. సమ్మెలో స్వచ్చంధంగా భాగస్వాములయ్యి, ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అని దిక్కులు పిక్కటిల్లెలా తెలంగాణ ప్రజలు నినదించారు. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారు. సకల జనుల సమ్మెకు నేటితో 14 ఏళ్ళు నిండిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. జై తెలంగాణ'' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story