ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ ఎప్పుడొస్తాయో తెలిపిన ప్ర‌భుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 April 2020 2:49 AM GMT
ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ ఎప్పుడొస్తాయో తెలిపిన ప్ర‌భుత్వం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనావైరస్ సృస్టిస్తున్న క‌ల్లోలం అంతాఇంతా కాదు. సామాన్యుడి నుండి దేశాక్ష్యుల వ‌ర‌కూ ఇంటికే ప‌రిమితం చేసిన ఘ‌న‌త దీనిది. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్ చ‌దువుకునే పిల్ల‌ల‌పై ప‌డింది. మార్చిలో జ‌ర‌గాల్సిన‌ పదో తరగతి పరీక్షలు వాయిదా పడగా.. ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్స్ మార్చి మొద‌టి వారంలో మొద‌ల‌వ‌డం కార‌ణంగా పూర్త‌య్యాయి. అయితే ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ ఎప్పుడొస్తాయో అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. లాక్‌డౌన్ నేఫ‌థ్యంలో రిజ‌ల్ట్స్ ఎప్పుడు వ‌స్తాయోన‌ని పిల్ల‌లు, తలిదండ్రులు వేయి క‌న్నుల‌తో ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఈ విష‌య‌మై తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టతనిచ్చారు. మే 3 వరకు లాక్‌డౌన్ ఉన్న నేఫ‌థ్యంలో.. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పేపర్లు దిద్దే కార్య‌క్ర‌మం మొద‌లుపెడ‌తామ‌ని ఆయ‌న అన్నారు. అయితే.. మే 3 త‌రువాత‌ లాక్‌డౌన్ ఎత్తివేసినా కొంత కాలం పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఈ నేఫ‌థ్యంలో అదనపు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని.. పేపర్ వ్యాల్యుయేష‌న్‌కు 25 రోజుల వరకు సమయం పడుతుందని.. దాంతో మే నెలాఖరు కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందన్నారు.

అలాగే.. పేప‌ర్ల మూల్యాంకానికి ఇప్పటికే కొన్ని కేంద్రాలను ఎంపిక చేశామని.. ఆ కేంద్రాల‌ను శుభ్ర‌పరుస్తున్నామ‌ని తెలియ‌జేశారు.ఇదిలావుంటే.. మార్చిలో జ‌రిగిన‌ ఇంటర్ ప‌రీక్ష‌ల‌లో ఒక పేపర్‌కు పరీక్ష జరగలేదని.. ఆ పరీక్షను 820 మంది విద్యార్థులు రాయాల్సివుంద‌ని అన్నారు. ఇదిలావుంటే.. గ‌త ఏడాది ఇంట‌ర్ రిజ‌ల్ట్స్‌లో త‌ప్పిదాలు జ‌ర‌గ‌డం కార‌ణంగా చాలామంది విధ్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం జ‌రిగింది. పెద్దఎత్తున ధ‌ర్నాలు, రాస్తారోకోలు జ‌రిగాయి. ఈ నేఫ‌థ్యంలో ఎటువంటి లోపాలు జ‌రుగ‌కుండా ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీపుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.

Next Story
Share it