కరోనా గురించి ఆగష్టులో చెప్పాడు.. ఎప్పుడు తగ్గుతుందో కూడా చెబుతున్నాడు..!

By Medi Samrat  Published on  16 April 2020 8:21 AM GMT
కరోనా గురించి ఆగష్టులో చెప్పాడు.. ఎప్పుడు తగ్గుతుందో కూడా చెబుతున్నాడు..!

అభిగ్య ఆనంద్.. యువ జ్యోతిష్యుడు ఆగష్టు నెలలోనే కరోనా వైరస్ వస్తుంది అని చెప్పాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 2019 ఆగష్టు నెలలో ‘Severe Danger To The World From Nov 2019 To April 2020’(ప్రపంచానికి అతి పెద్ద ప్రమాదం నవంబర్ 2019 నుండి ఏప్రిల్ 2020 వరకూ పొంచి ఉంది) అంటూ వీడియోను అప్లోడ్ చేశాడు. అతడు చెప్పినట్లే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని నమ్మే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ పిల్లాడిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు.

తాజాగా అభిగ్య ఆనంద్ మరో వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. మే 31కు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నాడు. కానీ అది కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమేనని.. జూన్ 31 వరకూ మానవజాతి ఎటువంటి శుభవార్తను వినదని చెబుతున్నాడు. మరో వీడియోలో అభిగ్య ఆనంద్ మాట్లాడుతూ డిసెంబర్ 20, 2020 న భూమికి మరో ఉపద్రవం పొంచి ఉందని.. ఆ ప్రభావం మర్చి 31, 2021 వరకూ కొనసాగుతుందని అంటున్నాడు. అది కరోనా వైరస్ ప్రభావం కంటే మరింత ఎక్కువ ఉంటుందని అంటున్నాడు.

ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ఉంటేనే రాబోయే మహమ్మారులను తట్టుకుని నిలబడగలమని చెబుతున్నాడు. జంతువులను చంపడం కూడా ఆపాలని సూచిస్తున్నాడు. పర్యావరణాన్ని పాడు చేస్తున్నామని.. భూమాత ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని చెబుతున్నాడు అభిగ్య. మాంసాన్ని అమ్మే వాళ్ళు తమ పనిని ఆపేయాలని.. దేవుడి కోసం త్యాగం చేయాలని సూచించాడు.

అభిగ్య తాజా వీడియోలో మాట్లాడుతూ మరో మహమ్మారి భూమిని అతలాకుతలం చేయబోతోందని.. డిసెంబర్ 2020 న మొదలయ్యే అవకాశం ఉందని.. మర్చి 31, 2021 వరకూ కొనసాగుతుందని.. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించాడు.

Next Story