జూబ్లీహిల్స్‌లో పబ్‌పై దాడి.. రూ.15 లక్షల మద్యం సీజ్‌

By సుభాష్  Published on  25 April 2020 9:08 PM IST
జూబ్లీహిల్స్‌లో పబ్‌పై దాడి.. రూ.15 లక్షల మద్యం సీజ్‌

కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని హైదరాబాద్‌లోని ఓ పబ్‌పై వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కొరఢా ఝులిపించారు. జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ అఫైర్స్‌ పబ్‌పై శనివారం టాస్క్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించింది. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్దంగా పబ్‌ నిర్వాహకులు మద్యం విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు పబ్‌పై దాడులు చేశారు.

ఈ దాడుల్లో రూ.15 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. జీవో 45 ఉల్లంఘన, లాక్‌డౌన్‌లో భాగంగా 188 సెక్షన్‌, ఎక్సైజ్‌కు సంబంధించిన కోవియేషన్‌ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, జూబ్లీహిల్స్‌లోని ఈ పబ్‌లో గత కొన్ని రోజులుగా రహస్యంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున, రాత్రి సమయంలో ఈ మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు.

Next Story