ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో ప్రమాదం

By సుభాష్  Published on  25 April 2020 10:17 AM GMT
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో ప్రమాదం

తెలంగాణలోని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌ని ఓ కారు ఢీకొట్టింది. మిర్యాలపెంట గ్రామంలో ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏజన్సీ ప్రాంతం కావడంతో సీఐ రమేష్‌, మరి కొందరు పోలీసులు బందోబస్తుగా వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కాన్వాయ్‌ ముందు ద్విచక్ర వాహనంపై సీఐ రమేష్‌, గన్‌మెన్‌ ప్రయాణిస్తున్న క్రమంలో ఇసుకమేది మూలమలుపు వద్ద అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ రమేష్‌తో పాటు గన్‌మెన్‌ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సీఐని ఖమ్మంకు తరలించారు.

Next Story
Share it