కరోనా నుండి కోలుకున్న మిల్కీబ్యూటీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Oct 2020 10:34 AM ISTకరోనా బారిన పడ్డ టాలీవుడ్ హీరోయిన్, మిల్కీబ్యూటీ తమన్నా కోలుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఏడు నెలల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న తమన్నాకు కరోనా సోకింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసినప్పటికీ తాను కరోనా బారిన పడినట్టు తమన్నా పేర్కొన్నారు. జ్వరం వస్తుండడంతో టెస్ట్ చేయించుకోవడంతో తమన్నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
అయితే.. ప్రస్తుతం తాను కరోనా నుండి కోలుకున్న విషయాన్ని తెలియజేస్తూ తమన్నా ఓ లేఖని విడుదల చేసింది. నేను నా టీం సెట్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా కరోనా ఎలా సోకిందో అర్ధం కావడం లేదు. గత వారం లైట్ ఫీవర్ ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నాను. నిపుణులైన వైద్యుల సంరక్షణలో ట్రీట్‌మెంట్ అనంతరం.. డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యాను.
కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. తనకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి అని తమన్నా తన లేఖలో పేర్కొన్నారు.