మిల్కీబ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 12:52 PM IST
మిల్కీబ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరికీ ఈ వైరస్‌ సోకుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. హైఫీవర్‌తో బాధడుతున్న తమన్నా ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. తమన్నాకు పాజిటివ్‌ అని తెలియడంతో.. ఆమె అభిమానులు షాక్‌కు గురైయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఫ్యామిలీతో పాటు సిబ్బంది అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించింది త‌మ‌న్నా. ఈ ప‌రీక్ష‌ల‌లో త‌ల్లిదండ్రుల‌కు పాజిటివ్ గా తేల‌గా.. త‌మ‌న్నాతోపాటు మిగిలిన సిబ్బందికి నెగెటివ్ వ‌చ్చింది.

అయితే ఇటీవ‌ల త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు క‌రోనా నుండి కోలుకోగా, ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. కాగా.. తమన్నా తెలుగులో ఒక్క సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రంలో గోపిచంద్‌ సరసన నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టింది చిత్ర యూనిట్‌.

Next Story