జొమాటో, స్విగ్గీలో కూరగాయల కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్లు.!

By అంజి  Published on  29 March 2020 3:44 AM GMT
జొమాటో, స్విగ్గీలో కూరగాయల కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్లు.!

హైదరాబాద్‌: ప్రజలందరీకి కూరగాయలు అందించేందుకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ విస్తృత చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో నగరంలో పలు చోట్ల రైతు బజార్లను ఏర్పాటు చేసింది. అయితే మార్కెట్ల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించలేకపోతున్నారు. ఇష్టానుసారంగా ఒకరిపై పడి ఒకరు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సంచార రైతు బజార్లను ప్రారంభించిన ప్రభుత్వం.. దానికి తోడుగా మరో నిర్ణయం తీసుకుంది. నగరాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా ఇంటికి వెళ్లి ఫుడ్‌ అందించే ప్రముఖ సంస్థలైన జొమాటో, స్వీగ్గీల ద్వారా కూరగాయలను కూడా చేరవేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు సంస్థలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. కొన్ని కాలనీల్లో సూపర్‌ మార్కెట్లు సైతం సమీప ఇళ్లలకు సరుకులను సరఫరా చేస్తున్నాయి.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం

నగరంలోని రైతు బజార్లలో రద్దీని నియంత్రించడం చాలా కష్టంగా మారింది. ప్రజలు కూడా కొంచెం కూడా ఆలోచించడం లేదు. సామాజిక దూరం ఏ మాత్రం అవలంభిచడం లేదు. కొనుగోలు దారులు వేలాది తరలివస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జోమాటో, స్వీగ్గీతో కురగాయాలను సరఫరా చేయాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని అమ్మక కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారని సమాచారం. 177 వాహనాల ద్వారా 331 ప్రాంతాల్లో సంచార రైతు బజార్లు తిరుగుతున్నాయి. ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవాలని వ్యాపారులు, దళారులు చూస్తే కఠిన చర్యలు ఉంటాయని మార్కెటింగ్‌ శాఖ హెచ్చరించింది. రైతు బజార్లతో పాట, హోల్‌సేల్‌ మార్కెట్‌లలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత మెయింటెన్‌ చేయాలని సూచించింది. ఇందుకోసం మార్కెటింగ్‌ శాఖ రూ.27.9 లక్షలను కేటాయించింది. నిత్యావసర వస్తువలు సరఫరాలో, ధరల విషయంలో ఫిర్యాదులకు 100కు డయల్‌ చేయాలని అధికారులు చెప్పారు.

Also Read: ఏప్రిల్‌ 1న పెన్షన్లు డోర్‌ డెలివరీ

Next Story