వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కుంకుమ, పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.