హైదరాబాదీయుల్లో కొత్త కోణాన్ని బయటపెట్టిన అధ్యయనం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 6:22 AM GMT
హైదరాబాదీయుల్లో కొత్త కోణాన్ని బయటపెట్టిన అధ్యయనం

కొన్నిసార్లు అంతే.. సంక్షోభాలు సరికొత్త విషయాల్ని తెలిసేలా చేయటమే కాదు.. అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాల్ని బయటకు తెస్తుంటాయి. అలాంటిదే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రపంచమంతా మాయదారి రోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. దేశంలోని ఆయా నగరాల్లోని ప్రజల మానసిక స్థితిగతులు.. వారి భయాందోళనలకు సంబంధించిన ఒక అధ్యయనం నిర్వహించారు. లాక్ డౌన్ 1 నుంచి 3 వరకూ చేపట్టిన ఈ సర్వేలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

లాక్ డౌన్ కారణంగా ఎదురయ్యే సమస్యలు.. సవాళ్లు.. భయాల్ని ధైర్యంగా ఎదుర్కొని.. మానసికంగా స్థిమితంగా వ్యవహరించటంలో హైదరాబాదీయులు టాప్ త్రీ ప్లేస్ లో ఉండటం విశేషం. ఈ అధ్యయనంలో దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో గువాహటి నిలిచింది. మూడో స్థానంలో హైదరాబాద్ మహానగరం ఉన్నట్లు మెంటల్ వెల్ బీయింగ్ ఇండెక్స్ వివరాల్ని వెల్లడించింది.

మాయదారి రోగం కారణంగా రానున్న రోజుల్లో తీవ్రమైన సంక్షోభం ఎదురుకావొచ్చన్న భయాలు.. అపోహలు ఉన్న వేళ ఆయా నగరాల్లోని ప్రజలు సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? వాటిని వారెలా అధిగమిస్తారు? వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది? అలాంటివి అంచనా వేసేందుకు టీఆర్ఏ అనే కన్జూమర్ ఇన్ సైట్స్ అండ్ బ్రాండ్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.

ఇందులో నగర ప్రజల మానసిక బలాన్ని అంచనా వేశారు. సవాళ్లను ఎదుర్కొనే విషయంలో వారెంత బలంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. ఇందులో ఢిల్లీ లాక్ డౌన్ మొదట్లో 63 శాతం ఉన్న వారు కాస్తా.. లాక్ డౌన్ 3కు వచ్చేసరికి మరింత బలంగా ఉన్నట్లు తేలింది. తర్వాతి స్థానంలో గువాహటి నిలిచినా.. తేడా తక్కువే. అదే సమయంలో హైదరాబాద్ విషయానికి వస్తే.. లాక్ డౌన్ 1తో పోలిస్తే 3 నాటికి వారి పరిస్థితి మెరుగుపడింది. టాప్ టెన్ లో చివరి మూడు స్థానాల్లో ముంబై.. బెంగళూరు.. చండీగఢ్ లు నలిచాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. లాక్ డౌన్ 1లో మానసికంగా హైదరాబాద్ కంటే బలంగా ఉన్నట్లు కనిపించిన జైపూర్.. లాక్ డౌన్ 3.0కు వచ్చేసరికి దిగజారింది. మొత్తంగా దేశంలోని పలు నగరాలతో పోలిస్తే.. హైదరాబాదీయులు గట్టేళ్లోనన్నది తాజా అధ్యయనం తేల్చింది.

Next Story