తెలంగాణలో కొత్తగా 74 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 30 May 2020 4:32 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6 గురు మృతి చెందారని తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు 2499 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదు అయిన కేసుల్లో తెలంగాణకు సంబంధించిననవి కేసులు 60.
జీహెచ్ఎంసీ పరిధిలో 41కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డిలో 3, మహబూబ్ నగర్‌లో 2, జగిత్యాలలో2, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్భన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొ కేసు చొప్పున నమోదు అయ్యాయి. వలస కూలీల్లో 9మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 5 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
ఇదిలావుంటే తెలంగాణలో మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. . కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.