అతి తక్కువ సమయంలో ఎంఈఐఎల్ సంస్థ అరుదైన రికార్డు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 3:19 PM GMT
అతి తక్కువ సమయంలో ఎంఈఐఎల్ సంస్థ అరుదైన రికార్డు

మే 29న కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగింది.‌ మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ప్రారంభించారు.

మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థ ఈ పనులను పూర్తీ చేసింది. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్‌ కేంద్రాలను పూర్తి చేసి రికార్డు సృష్టించింది ఈ సంస్థ. కెసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ కు 15టి.ఎం.సి ల నీటిని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి అందించగలదు. ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాల భూమి సాగు కోసం నీరు అందించగలదు. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించగలదు.

4

హైదరాబాద్ కు చెందిన ఎంఈఐఎల్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టులోని 1.05 లక్షల కోట్ల పనుల్లో 70000 కోట్ల పనులను పూర్తీ చేసే బాధ్యత తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు.. 96 మెషీన్లు 4,680 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తూ ఉండగా. ఎంఈఐఎల్ ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టింది. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్‌ కేంద్రాలను పూర్తి చేశామని సంస్థ ప్రకటించింది. రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్‌ చేసే విధంగా మేఘా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్‌ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంపింగ్‌ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

5

రిజర్వాయర్ల కాలువల పనులు పూర్తీ చేయాలంటే దశాబ్దాల సమయం పడుతూ ఉంటుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మాత్రం చాలా తొందరగా పూర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రో మెకానికల్ అండర్ గ్రౌండ్ పనులు నాలుగేళ్లలో పూర్తీ అవుతాయని ఎంఈఐఎల్ సంస్థ తెలిపింది. కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. అందులో 15 పంపింగ్‌ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో ఎంఈఐఎల్ సంస్థ పనులను పూర్తీ చేయబోతోంది. తెలంగాణకే కీర్తి తెచ్చిపెట్టే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉందని సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రపంచం లోనే అతి పెద్ద పంప్ హౌస్ ఇదని.. ఒక్కసారి పంప్ హౌస్ సైజ్ ను ఊహించుకోవాలని.. 470 మీటర్ల లోతులో 327 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల హైట్ తో నిర్మించామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఎంఈఐఎల్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి పెద్ద పవర్ సప్లై సిస్టమ్ ను అందించిందని.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అందిస్తున్న పవర్ సప్లై లో నాలుగో వంతు కాళేశ్వరం ప్రాజెక్టుకు అందిస్తూ వస్తున్నారు.

Next Story