న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  6 Sep 2020 9:50 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేర్లు ఫైనల్‌.. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్‌..!

బిగ్‌బాస్‌-4 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి బిగ్‌బాస్‌ రియాలిటీ షో బుల్లితెర అయిన స్టార్‌మాలో ప్రసారం కానుంది. అయితే హోస్‌లో ఉండే కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం కాగా.. తాజాగా మరో లిస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే ఫైనల్‌ లిస్టు అంటూ వినిపిస్తోంది. ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయం ప్రస్తుతం హట్‌ టాపిగా మారింది. తాజాగా వీరే కంటెస్టెంట్లు అంటూ ఓ లిస్టు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారు ఎవరెవరు అంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అనకాపల్లి సబ్‌జైలుకు నూతన్‌నాయుడు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు శిరోముండనం కేసులో సినీ నిర్మాత, బిగ్‌బాస్‌ ఫేమ్‌ నూతన్‌నాయుడుని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి నూతన్‌నాయుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శనివారం అర్థరాత్రి విశాఖ తీసుకొచ్చిన పోలీసులు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం నూతన్‌నాయుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. అతడికి ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా కట్టడికి.. ఆటగాళ్లకు రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ముంబై ఇండియన్స్

సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ ప్రారంభం కానుంది. కోరోనా జాగ్రత్తలు తీసుకుంటూ యూఏఈ వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని క్వారంటైన్‌ పూర్తిచేసుకుని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ అన్ని విధాలుగా సిద్దమవుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

దేశంలో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లా కేసర్‌పుర సమీపంలో ఓ వ్యాన్‌ ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేరళలో విషాదం: స్వామి కేశవానంద భారతి కన్నుమూత

కేరళలో విషాదం చోటు చేసుకుంది. స్వామి కేశవానంద భారతి (80) కన్నుమూశారు. ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగా ఉంటూ అందరినీ సన్మార్గంలో నడిపించే స్వామి లేరన్న వార్త ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేరళలో ఉత్తరాన కాసర్‌గౌడలోని ఎదనీర్‌ మఠ రక్షకుడిగా ఉన్న స్వామి కేశవానంద భారతి ఆదివారం తుది శ్వాస విడిచారు. కాగా, సుప్రీం కోర్టులోని కేసుల్లో స్వామి కేశవానంద భారతి కేసు చరిత్రాత్మకమైనది. 1973 నాటి ఈ కేసులో ఆస్తులపై రాజ్యాంగ బద్దంగా లభించే హక్కులపై ఈ కేసు నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. 24గంటల్లో 90వేల కేసులు

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 90,632 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. దీంతో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41లక్షలు(41,13,811)కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 31,80,866 మంది కోలుకోగా..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వార ఫలాలు : తేదీ 6-9-2020 ఆదివారం నుండి 12-9-2020 శనివారం వరకు

మేష రాశి :- ఈ రాశి వారికి ఈవారం అలంకార ప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, ఆనందాన్ని అభివృద్దిని కలిగిస్తాయి. ఈ వారంలో ఎక్కువ శుభ పరంపరని పొందనున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. చంద్రుడు కుటుంబ ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. బుధుడు అలంకార ప్రాప్తిని, గురుడు ధనాన్ని, శుక్రుడు స్త్రీ సౌఖ్యం ఇవ్వబోతున్నారు. ఇవన్నీ మీరు అనూహ్యంగా ఈ వారంలో పొందే అవకాశాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్రేకింగ్: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రం అయిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం అయ్యింది. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సంవత్సరంలాగే కల్యాణ మహోత్సవంలో ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇంట్లో విషాదం

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి హర్షవర్ధన్‌ మాతృమూర్తి (89)ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. తన తల్లి చనిపోయినట్లు తెలుపుతూ హర్షవర్ధన్ ట్విట్టర్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘భూమిపై నా ప్రియమైన వ్యక్తి.. నా తల్లి, స్వర్గానికి వెళ్లినట్లు తెలిపేందుకు చింతిస్తున్న. 89 ఏండ్ల వయస్సులో ఈ ఉదయం ఆమె గుండెపోటుతో మృతి చెందింది. గొప్ప వ్యక్తి, తత్వవేత్త, నా మార్గదర్శకురాలు నన్ను వదిలి వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జనసేన-బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ..!

2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తెలుగుదేశం-బీజేపీ కూటమితో కలిసి సాగి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి ఇతోధికంగా సాయం చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే తర్వాతి ఐదేళ్లలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అధికార పక్షానికి పవన్ మిత్రుడా, శత్రువా తెలియని గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ కన్ఫ్యూజన్ అలాగే కొనసాగి ఎన్నికల్లో ఇటు టీడీపీకి, అటు జనసేనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ దెబ్బతో టీడీపీకి పూర్తిగా దూరం అయిపోయాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story