కేరళలో విషాదం: స్వామి కేశవానంద భారతి కన్నుమూత

By సుభాష్  Published on  6 Sep 2020 6:43 AM GMT
కేరళలో విషాదం: స్వామి కేశవానంద భారతి కన్నుమూత

కేరళలో విషాదం చోటు చేసుకుంది. స్వామి కేశవానంద భారతి (80) కన్నుమూశారు. ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగా ఉంటూ అందరినీ సన్మార్గంలో నడిపించే స్వామి లేరన్న వార్త ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేరళలో ఉత్తరాన కాసర్‌గౌడలోని ఎదనీర్‌ మఠ రక్షకుడిగా ఉన్న స్వామి కేశవానంద భారతి ఆదివారం తుది శ్వాస విడిచారు.

కాగా, సుప్రీం కోర్టులోని కేసుల్లో స్వామి కేశవానంద భారతి కేసు చరిత్రాత్మకమైనది. 1973 నాటి ఈ కేసులో ఆస్తులపై రాజ్యాంగ బద్దంగా లభించే హక్కులపై ఈ కేసు నమోదైంది. అద్వైతాన్ని పాటించే భారతీ స్వామి స్వయంగా 1972లో ఈ కేసును వేశారు. కేరళ సర్కార్‌ మఠ ఆస్తులను టేకోవర్‌ చేసుకుంటే దానిని వ్యతిరేకిస్తూ ఆయన ఈ కేసు వేయడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణలు చేసింది. దాంతో ఈ కేసు తీర్పు కేరళ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది.

కాగా, సీనియర్‌ న్యాయవాది నానీ పాల్ఖీవాలా భారతీ స్వామి తరపున వాదించారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సర్వమిత్ర సిక్రీ ఈ కేసు విచారణకు 12 మంది జడ్జిలతో కూడిన కమిటీని నియమించారు. సుమారు 68 రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణ.. 1972 అక్టోబర్‌ 31న విచారణ మొదలై 1973 మార్చి 23న ముగిసింది. 1973 ఏప్రిల్‌లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగ మూల సూత్రాలను పార్లమెంట్‌ మార్చడానికి అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కోర్టు తీర్పుకు అనుకూలంగా ఏడుగురు జడ్జిలు మద్దతు ఇవ్వగా, ఆరుగురు జడ్జిలు వ్యతిరేకంగా మద్దతు పలికారు. దీంతో ఈ కేసులో భారతి స్వామి విజయం సాధించి మఠం ఆస్తులను కాపాడగలిగారు.

Next Story
Share it