Fact Check : సుదర్శన్ థియేటర్ లో సీటింగ్ అరేంజ్‌మెంట్‌ మార్చారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 10:01 AM GMT
Fact Check : సుదర్శన్ థియేటర్ లో సీటింగ్ అరేంజ్‌మెంట్‌ మార్చారా..?

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాక్ డౌన్ ను సడలించడంపై చాలా సూచనలు చేస్తూ వస్తోంది. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడ్డ సినిమా థియేటర్లు త్వరలో తెరచుకోనున్నాయి. ఇప్పటికే ఫ్లైట్ ల విషయంలో రెండు సీట్ల మధ్య ఓ సీటు ఖాళీ ఉంచాలన్న నిబంధనను ఉంచారు. ఇదే విధంగా సినిమా థియేటర్లలో సీట్ల విషయంలో కూడా గ్యాప్ ఉంచడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. సినిమా థియేటర్లను ఓపెన్ చేశాక పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ప్రశ్నార్థకమే..!

తాజాగా హైదరాబాద్ లోని సుదర్శన థియేటర్ లో సీటింగ్ ఇలా ఉందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సినిమా థియేటర్ కెపాసిటీని సగానికి తగ్గించడం కారణంగా సినిమా టికెట్ రేట్లు సగానికి పైగా పెరగబోతున్నాయని ఆ పోస్టులో ఉంది. సాధారణంగా 100 రూపాయలు ఉండే టికెట్ ధర కాస్తా 200 రూపాయలు అయ్యే అవకాశం ఉంది.

సినిమా థియేటర్ ను రీఓపెన్ ఎప్పుడు చేస్తారన్నది ఇంకా తెలీలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుదర్శన్ 35 ఎంఎం సినిమా థియేటర్.. హైదరాబాద్ లోని పురాతనమైన థియేటర్లలో ఒకటి. 1970 లలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా థియేటర్ ను ప్రారంభించారు.

నిజ నిర్ధారణ:

హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం.ఎం. సినిమా థియేటర్ లో సీటింగ్ మార్చడం అన్నది 'నిజం'

మే 13, 2020న newindianexpress.com కథనం ప్రకారం.. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత సినిమా థియేటర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై థియేటర్ల ఓనర్లు చర్చించారు. సినిమా థియేటర్లను ఓపెన్ చేయొచ్చు అని ప్రభుత్వం చెప్పగానే.. అందుకు తగ్గట్టుగా ముందస్తు మార్పులు చేయాలని సినిమా థియేటర్ల ఓపెనర్లు భావించారని.. అందుకు తగ్గట్టుగా థియేటర్లలో సీటింగ్ ను మార్చాలని భావించారు.. ఇప్పటికే కొన్ని థియేటర్లలో మార్పులు చేయడం మొదలుపెట్టారని మీడియాకు తెలిపారు.

ప్రేక్షకుల మధ్య సామాజిక దూరం ఉండేలా థియేటర్లలో మార్పులను తీసుకుని రావాలని అనుకున్నారని.. అందులో భాగంగానే సుదర్శన్ 35 ఎంఎం(ఆర్టీసీ క్రాస్ రోడ్స్) థియేటర్ లో కూడా మార్పులు వచ్చాయని చెబుతున్నారు. సీటింగ్ అరేంజ్మెంట్స్ ను బాగా తగ్గించి.. థియేటర్ల లోకి ప్రవేశించే ముందు డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ ను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తూ ఉన్నారని తెలుస్తోంది. మొదట్లో ప్రయోగాత్మకంగా పాత సినిమాలను మరోసారి విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు.

https://www.newindianexpress.com/cities/hyderabad/2020/may/13/hyderabad-theatres-prepare-for-trial-screening-2143008.html

దీని మీద తెలుగు వెబ్సైట్ 123telugu.com కూడా కథనాన్ని ప్రచురించింది. రాబౌయే కాలాల్లో సామాజిక దూరం అన్నది తప్పనిసరి కావడంతో సినిమా థియేటర్లలో ఈ మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో ఇప్పటికే ఇలాంటి మార్పులు మొదలయ్యాయి. ఒక్కొక్క సీట్ మధ్య 3 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ను ఏర్పాటు చేశారు.

https://123telugu.com/telugu/news/theaters-in-rearrangement-of-seating-system.html

సినిమా థియేటర్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నిజమేనని తెలిపారు. సినిమా థియేటర్ సీటింగ్ వ్యవస్థలో మార్పులు చేయడాన్ని కొద్దిరోజుల కిందట మొదలుపెట్టామని.. త్వరలో పూర్తీ అయిపోతుందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. అందరి సూచనల ప్రకారం సీటింగ్ లో మార్పులు చేశామని అన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుదర్శన్ థియేటర్ సీటింగ్ ఫోటోలు 'నిజమే'.

Claim Review:Fact Check : సుదర్శన్ థియేటర్ లో సీటింగ్ అరేంజ్‌మెంట్‌ మార్చారా..?
Claim Fact Check:false
Next Story